Share News

యూట్యూబర్‌ కేవీ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:19 AM

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తెలంగాణకు చెందిన యూట్యూబర్‌ కేవీ రెడ్డిని పోలీసులు విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో..

యూట్యూబర్‌ కేవీ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

బొబ్బిలి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తెలంగాణకు చెందిన యూట్యూబర్‌ కేవీ రెడ్డిని పోలీసులు విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో హాజరుపర్చారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రోహిణీరావు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు కేవీ రెడ్డిని స్థానిక సబ్‌ జైలుకు తరలించారు. నిందితుడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Jul 03 , 2026 | 04:20 AM