యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:55 PM
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
పాములపాడు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం పాములపాడులో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణలో కురువ రమేశ అధ్యక్షతన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువత చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఎస్‌ఐ తిరుపాల్ బౌలింగు చేయగా బైరెడ్డి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. నిర్వాహకులను, బహుమతులు అందిస్తున్న దాతలను అభినందించారు. పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ కురువ ఎల్లయ్య, నాయకులు బాలీశ్వరరెడ్డి, వీరారెడ్డి, వివేకానంద విద్యావిహార్ ప్రిన్సిపాల్ రాయపాటి గోపాల్, మమత క్రినిక్ డాక్టర్ రాజు ఈశ్వరరెడ్డి, రవీంద్రరెడ్డి, మధుక్రిష్ణ, రామక్రిష్ణ, ఎల్లగౌడ్, సురేశ, సాయిక్రిష్ణ, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.