Share News

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:05 PM

మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఓ యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.

   కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

బండిఆత్మకూరు మార్చి1(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఓ యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ప్రకాశం జిల్లా నుంచి పల్లె సృసన అనే పరిశోధన సంస్థ నుంచి 21 మంది యువకులు ఓ వాహనంలో బయలుదేరి వచ్చారు. వీరంతా గ్రామాల్లో రైతులు, కూలీలతో మమేకమై పరిశోధనలు సాగిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఓంకారం వెళ్లే దారిలో ఉన్న కేసీ కెనాల్‌ వెంట కొంత మంది పరిశోధనలో భాగంగా వెళ్తూ హేమంత(17) అనే యువకుడు కెనాల్‌లో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బండిఆత్మకూరు పోలీసులు, నంద్యాల అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. సాయంత్రం డ్రోన్ల సహాయంతో గాలించారు. ఎలాంటి ఫలితం రాకపోవటంతో తిరిగి సోమవారం ఉయం నుంచి గాలించనున్నారు. వీరంతా పలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 11:05 PM