11న యూత్ మారథాన్: మాధవ్
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:34 AM
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 11న రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో 5 కి.మీ. యూత్ మారథాన్...
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 11న రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో 5 కి.మీ. యూత్ మారథాన్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 12 వరకూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.