Share News

Governor Abdul Nazeer: యువతే దేశ భవిష్యత్తు రూపకర్తలు: గవర్నర్‌

ABN , Publish Date - Jan 05 , 2026 | 05:21 AM

ధైర్యం, పట్టుదల, సంకల్పంతో దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందని గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం లోక్‌భవన్‌లో జరిగిన ఓ..

Governor Abdul Nazeer: యువతే దేశ భవిష్యత్తు రూపకర్తలు: గవర్నర్‌

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ధైర్యం, పట్టుదల, సంకల్పంతో దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందని గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం లోక్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ యువజనోత్సవంలో పాల్గొననున్న యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన బృందం... వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌-2026 కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే రూపకర్తలని, వికసిత్‌ భారత్‌-2047 దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువజన సర్వీసుల కమిషనర్‌ ఎస్‌.భరణి, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ పి.ఎ్‌స.సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 05:22 AM