Share News

పవన్‌ను కలిసిన యంగ్‌ బైకర్‌ తాప్సీ ఉపాధ్యాయ

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:06 AM

ఒబెసిటీ ముక్త్‌ భారత్‌ - మిషన్‌ హెల్దీ భారత్‌ యాత్ర చేస్తున్న యంగ్‌ బైకర్‌ తాప్సీ ఉపాధ్యాయ, డిప్యూటీ సీఎం పవ న్‌ కల్యాణ్‌ను కలిశారు.

పవన్‌ను కలిసిన యంగ్‌ బైకర్‌ తాప్సీ ఉపాధ్యాయ

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఒబెసిటీ ముక్త్‌ భారత్‌ - మిషన్‌ హెల్దీ భారత్‌ యాత్ర చేస్తున్న యంగ్‌ బైకర్‌ తాప్సీ ఉపాధ్యాయ, డిప్యూటీ సీఎం పవ న్‌ కల్యాణ్‌ను కలిశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన 23 ఏళ్ల తాప్సీ 2025 మార్చి 9 బైక్‌ యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకూ 17,400 కిలోమీటర్ల ప్రయాణం చేసి, 500 పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె, పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆమెను సత్కరించారు. కాగా, అంతకు ముందు వెలగపూడి సచివాలయంలో ఆమెను మంత్రి సత్యకుమార్‌ సత్కరించి, అభినందించారు.

Updated Date - Mar 27 , 2026 | 06:07 AM