ఓటరు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:52 PM
ఓటరు జాబితాల్లో పేర్లు సరి చూసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ సూచించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
ఆదోని, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల్లో పేర్లు సరి చూసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ సూచించారు. శనివారం పట్టణంలోని 24వ వార్డు శంకర్‌నగర్‌లో ఓటరు వెరిఫికేషన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నా రు. టీడీపీ యువనేత సిద్ధార్థనాయుడుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబి తా అత్యంత కీలకమన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం లేదా సవరించుకోవడంలో అశ్రద్ధ వహించకూడదని, ప్రతి పౌరు డు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే దిశగా ఓటరు నమోదు ప్రక్రియలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లుబావి మల్లి, మహాదేవ, సాదిక్‌వలి, రాజశేఖర్, బసవరాజు, శ్రీరాములు, జగదీష్, బాబురావు, విజయ్ పాల్గొన్నారు.