రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:59 PM
రైతులు రాయితీ పప్పుశనగ విత్తనాల కోసం వచ్చేనెల 5నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ఆలూరు ఏడీఏ చెంగలరాయుడు అన్నారు.
ఆలూరు రూరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతులు రాయితీ పప్పుశనగ విత్తనాల కోసం వచ్చేనెల 5నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ఆలూరు ఏడీఏ చెంగలరాయుడు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు సబ్‌డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పప్పుశనగ విత్తనాలను 10,810 క్వింటాళ్లను కేటాయించినట్లు తెలిపారు. ఆలూరుకు 3350 క్వింటాళ్లు, ఆస్పరి మండలానికి 2500 క్వింటాళ్లు, చిప్పగిరి మండలానికి 2500 క్వింటాళ్లు, హాలహర్వి మండలానికి 2030 క్వింటాళ్లు, హొళగుంద మండలానికి 230 క్వింటాళ్ల విత్తనాలను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం పూర్తి ధర రూ.9 వేలు నిర్ణయించిందని, ఇందులో 35శాతం సబ్సిడీ రూ.3150 పోనూ రైతు వాటా క్వింటాలుకు రూ.5850గా నిర్ణయించిందన్నారు. రబీలో పప్పుశనగ సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డుతో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని, నేరుగా కివ్‌ఆర్ కోడ్ ద్వారా ఏపీ సీడ్స్‌కు చెల్లించాలన్నారు. సమావేశంలో ఏడీఏ కార్యాలయ ఏఓ దేవభూషణ్‌కుమార్, ఏవో వెంకటేశ్వరగౌడ్ తదితరులు పాల్గొన్నారు.