Share News

యోగాంధ్రకు 55 లక్షల మంది రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:54 AM

యోగాంధ్ర-2026 కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం వరకు 55 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

యోగాంధ్రకు 55 లక్షల మంది రిజిస్ట్రేషన్లు

  • వేదిక.. విజయవాడ ఐజీఎం స్టేడియానికి మార్పు

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర-2026 కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం వరకు 55 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 24 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 5,34,217, అనంతపురంలో 4,98,758, నెల్లూరులో 4,94,757, కడప జిల్లాలో 4,79,510 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 21న జరిగే రాష్ట్రస్థాయి యోగ కార్యక్రమాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలుత రాజధానిలోని వెంకటపాలెం సమీప కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్‌బైపా్‌సపై నిర్వహించాలనుకుంది. అయితే, ఈ నెల 18 నుంచి 21 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వేదికను ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Jun 16 , 2026 | 03:54 AM