Share News

యోగాంధ్రకు 15,173 మంది మెడికల్‌ విద్యార్థులు

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:23 AM

యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభిస్తోందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు.

యోగాంధ్రకు 15,173 మంది మెడికల్‌ విద్యార్థులు

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభిస్తోందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య, దంత, నర్సింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వైద్యులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్త ఎత్తున యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని సంస్థల్లో మొత్తం 15,173 మంది తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే అత్యధికంగా 10,792 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారిలో కొంత మంది స్థానికంగా నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

Updated Date - Jun 18 , 2026 | 04:24 AM