Share News

నాడు బస్తా రూ.300.. నేడు రూ.4,000

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:20 PM

గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి.

   నాడు బస్తా రూ.300..   నేడు రూ.4,000
నిమ్మకాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

జిల్లాలో 3,200 ఎకరాల్లో నిమ్మకాయల సాగు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ

చాగలమర్రి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేనివిధంగా నిమ్మరైతు లాభాలను చవి చూస్తున్నాడు. ఎండల తీవ్రత, నిమ్మ సాగు తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమ్మకాయల అ‘ధర’హో అనిపిస్తున్నాయి. నాడు 25 కేజీల బస్తా రూ.300 ఉండగా నేడు రూ.4,000 పలుకుతోంది. ఓ పక్క వేసవి ఎండల తీవ్రత పెరిగిపోతుంటే మరో పక్క నిమ్మకాయలకు డిమాండ్‌ కూడా అనూహ్యంగా పెరుగుతోంది. దిగుబడులు తక్కువగా ఉన్న సమయంలో ధర పెరగడం రైతులను కాస్తంత నిరాశకు గురి చేసింది. అయితే ఉన్న పంటకు మంచి ధర దక్కింది చాలన్న సంతోషాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తక్కువగా ఉండటం ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీ, కలకత్తా, లక్నో, హైదరాబాదు, భూపాల్‌ వంటి నగరాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతుంటాయి.

జిల్లా పరిధిలో సాగు ఇలా..

నంద్యాల జిల్లాలో 3,200 ఎకరాల్లో నిమ్మ సాగు చేశారు. ఆళ్లగడ్డ డివిజన పరిధిలో 1700 ఎకరాల్లో నిమ్మ సాగు అవుతోంది. ఒక్కోక్క నిమ్మ కాయ రూ.5 వరకు పలుకుతుండటంతో సామాన్యుడు వామ్మో నిమ్మ అంటూ అల్లాడిపోతున్నాడు.

దిగుబడులు తగ్గుదల

జిల్లా పరిధిలో సాగు చేసిన నిమ్మ పంటకు తెగుళ్లు, వాతావరణం దృష్ట్యా కాయ సైజులో కాపు తగ్గిందని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాపు బాగానే వచ్చిందని, ఎకరాకు 5టన్నుల వరకు రాగా తెగుళ్లు ఉన్న చోట 4టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పథకం కింద..

కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలకు ప్రోత్సాహం లభించడంతో రైతులు మళ్లీ నిమ్మ సాగు వైపు మొగ్గు చూపారు. 100 శాతం సబ్సిడీతో ఎకరాకు 110 నిమ్మ చెట్లు ఏడాదికి రూ.48వేలు చొప్పున మూడేళ్ల పాటు నిధులు మంజూరు చేస్తోంది. రైతు మరో రూ.50వేలు వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిమ్మ సాగులో రైతులు మూడేళ్ల పాటు అంతర్‌ పంట సాగు చేసుకునేలా ఉద్యానశాఖ ప్రొత్సహిస్తోంది. 5 ఏళ్ల తరువాత మాత్రమే దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఉద్యాన పంటలకు ప్రోత్సాహం కల్పించడంతో పండ్ల తోటల సాగుపై దృష్టి సారించా

Updated Date - Apr 08 , 2026 | 11:20 PM