యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:24 AM
యశ్వంత్‌పూర్ నుంచి కటిహార్‌కు వెళ్లే (06571) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. స్క్రూ కప్లింగ్ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి.
బోగీల మధ్య కప్లింగ్ తెగి రెండుగా విడిపోయిన రైలు
గుత్తి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): యశ్వంత్‌పూర్ నుంచి కటిహార్‌కు వెళ్లే (06571) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. స్క్రూ కప్లింగ్ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి. లోకో పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి, రైలును నిలిపివేశారు. వివరాలు.. యశ్వంత్‌పూర్ నుంచి కటిహార్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక వీక్లీ రైలు మంగళవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫాంకు చేరుకుంది. స్టేషన్ నుంచి బయలుదేరి, వేగం పుంజుకుని సిగ్నల్ దాటగానే ఎస్-6, ఎస్-7 బోగీల మధ్య ఉన్న జాయింట్ స్ర్కూ కప్లింగ్ కట్ కావడంతో రైలు రెండుగా విడిపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలేట్ రైలును నిలిపివేసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, టెక్నిషియన్లు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.