వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:13 AM
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ఎన్నికల సంఘాన్ని కోరారు.
గడివేముల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ఎన్నికల సంఘాన్ని కోరారు. దుర్వేసి గ్రామంలో సోమవారం ఆమె సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతులకు రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. దుర్వేసి గ్రామంలోని రూ.45 లక్షలతో సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాణ్యం మార్కెట్‌యార్డ్ చైర్మన అంగజాల గీత, మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, పాణ్యం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణయాదవ్, టీడీపీ మండల అధ్యక్షుడు దిలి్‌పకుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
వైభవంగా నిర్వహించాలి
గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయంలో ఈనెల 14 నుంచి జరుగనున్న మహాశివరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలని పాణ్యం ఎమ్మె ల్యే గౌరుచరిత అన్నారు. సోమవారం దుర్గాభోగేశ్వర ఆలయంలో త హసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మహాశివరాత్రికి దేవాదాయశాఖ చేపట్టబోయే పనులపై ఆరా తీశారు. సమన్వయంతో ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, ఆలయ చైర్మన శ్రీనివాసులు, ఎంపీడీవో వాసుదేవగుప్త, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.