Share News

వైసీపీ అబద్ధ ప్రచారాలు

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:08 AM

సీపీ అబద్ధ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చే స్ర్కిప్టు చదివి పేటీమ్‌ బ్యాచ్‌ ప్రజలను మభ్యపెడుతున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.

   వైసీపీ అబద్ధ ప్రచారాలు
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు

రాష్ట్రానికి జగన్‌ వైరస్‌లాంటి వాడు..

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ అబద్ధ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చే స్ర్కిప్టు చదివి పేటీమ్‌ బ్యాచ్‌ ప్రజలను మభ్యపెడుతున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్మోహన్‌ రెడ్డి వైరస్‌ లాంటి వాడని, చెడు పనులన్నీ ఇతరులపై నెడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ దేశంలోనే విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చంద్రబాబు చేసి చూపించారన్నారు. అక్వా రంగానికి రూ. 3.50 పైసలు యూనిల్‌ ధర ఉంటే దాన్ని రూ. 1.50 తగ్గించామని, ట్రూఆప్‌ చార్జీల ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తూ మరో వైపు విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థలు నష్టపోకుండా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ సమవేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్‌, కార్పొరేషన్ల డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, ధరూర్‌ జేమ్స్‌, మంచాలకట్ట భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:08 AM