అధికారంలోకి వస్తే.. రక్తంతో హోలీ!
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:04 AM
వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నెల్లూరుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు...
జగన్ నెల్లూరు పర్యటనలో ‘రప్పా.. రప్పా’ నినాదాలతో వైసీపీ కార్యకర్తల వీరంగం
నెల్లూరు (వెంకటేశ్వరపురం), ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నెల్లూరుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు ‘రప్పా.. రప్పా’ నినాదాలతో వీరంగం చేశారు. ‘మీరు అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి’ అంటూ నినాదాలు చేశారు. అంతేగాక బారికేడ్లు గోడలను దూకి జగన్ హెలిప్యాడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అనంతరం హెచ్చరించి వదిలేశారు. జగన్ గురువారం ఉదయం హెలిక్యాప్టర్‌లో నెల్లూరు కనుపర్తిపాడుకు చేరుకొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన వీపీఆర్ కల్యాణమండంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి 11 గంటల ప్రాంతంలో బెంగళూరు వెళ్లిపోయారు.