మగమనిషైనా.. ఆడమనిషైనా.. గొంతులు కోసేయండి!
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:36 AM
‘ఎవడైనా కానీ.. మగమనిషైనా.. ఆడమనిషైనా సరే గొంతులు కోసేయండి... నా కొడుకుల్ని... ఏ లం..కొడుకులూ ఏమీ చేయలేరు...’ అంటూ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు బి.శ్రీరాములు రాయడానికి వీలులేని..
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు బూతుల పర్వం
వైసీపీ శ్రేణులను ఘర్షణలకు ప్రోత్సహిస్తున్న వీడియో వైరల్
కర్నూలు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘ఎవడైనా కానీ.. మగమనిషైనా.. ఆడమనిషైనా సరే గొంతులు కోసేయండి... నా కొడుకుల్ని... ఏ లం..కొడుకులూ ఏమీ చేయలేరు...’ అంటూ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు బి.శ్రీరాములు రాయడానికి వీలులేని భాషలో వైసీపీ శ్రేణులను ఘర్షణలకు ప్రోత్సహించాడు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో గతవారం వైసీపీ నేతలు చేసిన దాడిని ముందుండి నడిపించిన విరూపాక్షి, శ్రీరాములు బూతు పురాణం వీడియో వైరలైంది. శ్రీరాములు వ్యాఖ్యలతో వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయి దళితలు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇసుకను అక్రమంగా డంప్ చేసిన వ్యవహారంలో వైసీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో ఎమ్మెల్యే బి. విరూపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములు, కొడుకు చంద్రశేఖర్, వంద మందికిపైగా అనుచరుతోు నేమకల్లు, సంగాల గ్రామాల్లోని టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తంపై కర్రలతో దాడిచేసి, ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. విరూపాక్షి, శ్రీరాములు నేమకల్లులోకి వచ్చిన సమయంలో స్థానిక వైసీపీ శ్రేణులెవరూ వెంట రాలేదు. వారిని రెచ్చగొట్టేందుకు పత్రికల్లో రాయడానికి వీలుగాని పదజాలంతో టీడీపీ నేతలను బూతులతో రెచ్చగొట్టారు. ఈ ఘటనలో విరూపాక్షి, చంద్రశేఖర్, శ్రీరాములు సహా 34 మందిపై చిప్పగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. విరూపాక్షి, మరో 15మందిని గత ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో కర్నూలు సబ్ జైల్‌కు తరలించారు. గురువారం 8 మంది నిందితులు ఆలూరు కోర్టులో లొంగిపోగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు.