వైసీపీ దాడులు గర్హనీయం
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:54 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం గర్హనీయమని జర్నలిస్టు సం ఘాలు పేర్కొన్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసిన మీడి యా సంస్థలు....
ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఖండన
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం గర్హనీయమని జర్నలిస్టు సం ఘాలు పేర్కొన్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసిన మీడి యా సంస్థలు, జర్నలిస్టులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమని పేర్కొన్నాయి. దాడిని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా భావించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఏపీ ఎలకా్ట్రనిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ పేర్కొన్నారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏబీఎన్ ప్రసారాల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో తమకు నచ్చని వార్తలు ఉంటే వాటిపై స్పందించే పద్ధతి ఇది కాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. రాజకీయ పార్టీకి చెందిన నేతలు బహిరంగ చర్చను ఆశ్లీల పదజాలంతో కలుషితం చేయడం, వాదనలను భౌతిక దాడుల స్థాయికి దిగజార్చడం తగదన్నారు.