వైసీపీవి చిల్లర రాజకీయాలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:24 PM
వైసీపీ ఓ చిల్లర పార్టీ అని... పత్రికల్లో, మీడియాలో ఉనికి కోసం డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌పై బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని జనసేన ఆలూ రు నియోజకవర్గ ఇన్‌చార్జి తెర్నెకల్ వెంకప్ప అన్నారు.
- జనసేన పార్టీ ఆలూరు ఇన్‌చార్జి వెంకప్ప
ఆలూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఓ చిల్లర పార్టీ అని... పత్రికల్లో, మీడియాలో ఉనికి కోసం డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌పై బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని జనసేన ఆలూ రు నియోజకవర్గ ఇన్‌చార్జి తెర్నెకల్ వెంకప్ప అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి వైపు అడు గులు వేస్తున్నారన్నారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు విమ ర్శిస్తున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని చూడాలన్నారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రంజిత్, శేఖర్, మున్నా, నందు, మహేష్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.