Share News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:42 AM

కిడ్నాప్‌, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు నూజివీడు ఒకటవ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్‌

నూజివీడు టౌన్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కిడ్నాప్‌, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు నూజివీడు ఒకటవ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోయిలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్‌ కేసులో ముస్తఫా, అతని కుమారుడు బషీర్‌ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. పరారీలో ఉన్న ముస్తఫాను పోలీసులు సోమవారం గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ముస్తఫా కుమారుడు బషీర్‌ను బుధవారమే నెల్లూరు జైలుకు పంపించారు.

Updated Date - Aug 07 , 2026 | 05:43 AM