Share News

వైసీపీ అరాచకానికి మూడేళ్లు

ABN , Publish Date - Jun 17 , 2026 | 06:07 AM

తన సోదరిని వేధిస్తున్న వైసీపీ వారిని ప్రశ్నించినందుకు బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి బాలుడు అమర్నాథ్‌గౌడ్‌ను మంటల్లో కాల్చి చంపి నేటికి మూడేళ్లు పూర్తయిందని..

వైసీపీ అరాచకానికి మూడేళ్లు

  • శెట్టిబలిజ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు

రాజమహేంద్రవరం సిటీ/అనపర్తి, రేపల్లె, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తన సోదరిని వేధిస్తున్న వైసీపీ వారిని ప్రశ్నించినందుకు బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి బాలుడు అమర్నాథ్‌గౌడ్‌ను మంటల్లో కాల్చి చంపి నేటికి మూడేళ్లు పూర్తయిందని శెట్టిబలిజ కార్పొరేషన్‌ స్టేట్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. ఈ కేసులో నిందితులను వైసీపీ నాయకులు సమర్ధించారని, ఇది వారి మనస్తత్వానికి నిదర్శనమని సత్తిబాబు ధ్వజమెత్తారు. అలాగే అనపర్తిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో అమర్నాథ్‌గౌడ్‌కు నివాళులర్పించారు. కాగా, వైసీపీ మూకల చేతిలో బలైన అమర్‌నాథ్‌గౌడ్‌ కుటుంబానికి అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. అమర్‌నాథ్‌గౌడ్‌ మూడో వర్ధంతి కార్యక్రమంలో మంగళవారం మంత్రి పాల్గొని నివాళులర్పించారు. అమర్‌నాథ్‌ నిలయానికి శంకుస్థాపన చేశారు.

Updated Date - Jun 17 , 2026 | 06:07 AM