అంబేడ్కర్ అందరివాడు: యశ్వంత్ అంబేడ్కర్
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:08 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని రిపబ్లికన్ పార్టీ జాతీయ అధ్యక్షులు...
ఘంటసాల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని రిపబ్లికన్ పార్టీ జాతీయ అధ్యక్షులు, అంబేడ్కర్ రెండో మనవడు డాక్టర్ భీమ్‌రావ్ యశ్వంత్ అంబేడ్కర్ చెప్పారు. కృష్ణా జిల్లా ఘంటసాల అంబేడ్కర్ నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆర్‌పీఐ అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ దేశంలో నిమ్న జాతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి, వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని తెలిపారు. అనంతరం బుద్ధుని విగ్రహాన్ని యశ్వంత్ అంబేడ్కర్, ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్ ఆవిష్కరించారు.