Share News

రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్‌ కుట్ర

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:24 AM

మావిగన్‌ వర్సెస్‌ అమరావతి అనేది 2029 ఎన్నికల్లో తన అజెండా అని జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి..

రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్‌ కుట్ర

  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): మావిగన్‌ వర్సెస్‌ అమరావతి అనేది 2029 ఎన్నికల్లో తన అజెండా అని జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పన్నిన మరో కుట్ర అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. 2019-24 ఎన్నికల సమయంలో జగన్‌ తెచ్చిన మూడు రాజధానుల నినాదం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించడంతోపాటు వైసీపీని అధఃపాతాళానికి నెట్టేసినా జగన్‌లో మార్పు రాలేదన్నారు. జగన్‌ ప్రగతి నిరోధకుడని, తిరోగమన ఆలోచనలు ఉన్న వ్యక్తి అన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 05:25 AM