Share News

నవ్వులపాలవుతున్న వైసీపీ నేతలు: యనమల

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:21 AM

చమురు కొరతపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వారి అవగాహన రాహిత్యానికి అద్దం పడుతున్నాయి. సీఎం చంద్రబాబు కారణంగానే..

నవ్వులపాలవుతున్న వైసీపీ నేతలు: యనమల

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘చమురు కొరతపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వారి అవగాహన రాహిత్యానికి అద్దం పడుతున్నాయి. సీఎం చంద్రబాబు కారణంగానే రాష్ట్రంలో చమురు కొరత ఏర్పడిందని వైసీపీ నేతల విమర్శలతో వారే నవ్వులపాలవుతున్నారు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చమురు కొరత ఏర్పడిందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ వారికి అధికారం కావాలి కానీ ఏపీ భవిష్యత్తు అవసరం లేదన్నారు

Updated Date - Apr 29 , 2026 | 04:22 AM