బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అభినందనీయం: యనమల
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:43 AM
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో..
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా 24 శాతానికి కుదించి బీసీలకు దక్కాల్సిన రాజకీయ అధికారాన్ని లాగేసుకుందన్నారు.