అసంబద్ధ ప్రకటనలతో జగన్ నవ్వులపాలు: యనమల
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:53 AM
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే రాజధానిపై జగన్ కుట్రలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు...
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే రాజధానిపై జగన్ కుట్రలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. అమరావతికి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, ఇది జగన్‌కు ఇష్టం లేకపోవడం దురదృష్టకరమని యనమల పేర్కొన్నారు..