ఏపీపై బెంగళూరులో కుట్ర: యనమల
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:05 AM
బెంగళూరులో జగన్ మకాం వేయటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో జగన్ మకాం వేయటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ఏపీలో కుట్రల అమలుకు జగన్ బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ పెట్టారని ఆరోపించారు. తన అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెస్సునే కేంద్రంగా చేసుకున్నారని అన్నారు. పదే పదే బెంగళూరు వెళుతూ అక్కడే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జగన్ ఏపీలో దోచుకున్న తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్సుకు తరలించారని అన్నారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం జగన్ సహా పలువురు వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600ు మేర పెరిగాయంటే వారి అవినీతి ఏపాటిదో అర్థం అవుతుందని యనమల అన్నారు.