మత్స్యకారుడి వలకు చిక్కిన 4టన్నుల కనగంతలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:08 AM
యానాం మత్స్యకారుడికి శనివారం మత్స్యసంపద చిక్కింది. ప్రస్తుతం వేట నిషేధం కావడంతో యానాం గోదావరిని ఆనుకుని ఉన్న కాలువలు, గోదావరి ప్రవాహంలో..
యానాం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): యానాం మత్స్యకారుడికి శనివారం మత్స్యసంపద చిక్కింది. ప్రస్తుతం వేట నిషేధం కావడంతో యానాం గోదావరిని ఆనుకుని ఉన్న కాలువలు, గోదావరి ప్రవాహంలో గవనాల వలతో (సుమారు 400బార్లు పొడవు) వేట కొనసాగిస్తుండుగా ఒక్క పట్టుగా నాలుగు టన్నుల కనగంతలు పడ్డాయి. దీంతో యానాం మున్సిపాల్టీ పరిధిలో కొత్తపేటకు చెందిన మత్య్సకారుడు మల్లాడి పోసియ్య కుటుంబ సుభ్యులకు చెందిన మూడు నావలు నాలుగు టన్నుల కనగంతల చేపలతో నిండిపోయాయి. వీటి ధర ప్రస్తుతం కిలో రూ.72పైబడి ఉంది. అయితే వాతావారణంలో మార్పులు, గాలులు వీయడంతో గణుంల రూపంలో (చేపలు సముదాయం) మత్య్సకారుల వలలకు చిక్కినట్లు తెలిసింది.