డీలిమిటేషన్‌ను అడ్డుకోండి: షర్మిల
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:50 AM
కేంద్రం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని సీఎం చంద్రబాబును పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. బుధవారం ఈ మేరకు చంద్రబాబుకు ఆమె 3 పేజీల లేఖ రాశారు.
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని సీఎం చంద్రబాబును పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. బుధవారం ఈ మేరకు చంద్రబాబుకు ఆమె 3 పేజీల లేఖ రాశారు. డీలిమిటేషన్ జరిగితే రాష్ట్ర రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు ప్రమాదమని ఆ లేఖ లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా సంప్రదింపులు లేకుండా, కేంద్రంలోని ఎన్డీ యే ప్రభుత్వం తీసుకువస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన మాత్రమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర రాజకీయ బలం, ఆర్థిక అవకాశాలు ఘోరంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ ప్రాధాన్య విషయం కాదని, రాష్ట్ర అస్థిత్వానికి సంబంధించిందన విషయమని పేర్కొన్నారు.