Share News

అమరావతిలో ‘జేవియర్‌’ క్యాంపస్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:44 AM

ప్రతిష్ఠాత్మక జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) అమరావతిలో క్యాంపస్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.

అమరావతిలో ‘జేవియర్‌’ క్యాంపస్‌

  • జంషెడ్‌పూర్‌, ఢిల్లీ తర్వాత ఏపీలో ప్రతిష్ఠాత్మక క్యాంపస్‌

  • రూ.300 కోట్ల పెట్టుబడితో.. 61.7 ఎకరాల్లో నిర్మాణం

  • ఏపీసీఆర్డీఏ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మధ్య కుదిరిన ఒప్పందం

గుంటూరు, తుళ్లూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) అమరావతిలో క్యాంపస్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఏపీసీఆర్డీఏతో శుక్రవారం అగ్రిమెంట్‌ ఫర్‌ సేల్‌ కుదుర్చుకున్నారు. 61.7 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ క్యాంపస్‌ నిర్మించనుంది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ క్యాంప్‌సలో మొదటి దశలో 1,000 మంది విద్యార్థుల కోసం సమగ్ర అకడమిక్‌ ప్రోగ్రామ్‌లు, 200 మంది వృత్తి నిపుణుల కోసం ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించే ప్రణాళిక ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 1949లో స్థాపించిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, భారత్‌లోని పురాతన, ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం జంషెడ్‌పూర్‌, ఢిల్లీల్లో క్యాంప్‌సలున్నాయి.

రాజధానిలో ఎన్టీపీసీ కార్యాలయం..

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్‌ అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం ఏపీ సీఆర్డీఏతో లీజ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటైతే రాజధాని ప్రాంతంలో సంస్థాగత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 04:45 AM