Share News

జీజీహెచలో జిరాక్స్‌ సెంటర్‌ వివాదం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:16 PM

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి జిరాక్స్‌ సెంటర్‌ పేరుతో కంటైనర్‌బాక్స్‌ను ఏర్పాటు చేయడం కలకలం రేపింది.

     జీజీహెచలో జిరాక్స్‌ సెంటర్‌ వివాదం
న్యూడయాగ్నోసిక్‌ బ్లాక్‌ ఆవరణంలో రాత్రి ఉంచిన కంటైనర్‌ బాక్స్‌

అనుమతి లేకుండానే ఏర్పాటు చేసిన మంత్రి అనుచరుడు

సూపరింటెండెంట్‌ ఆదేశాలతో తొలగింపు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి జిరాక్స్‌ సెంటర్‌ పేరుతో కంటైనర్‌బాక్స్‌ను ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రాత్రికి రాత్రే జిరాక్స్‌ సెంటర్‌ కోసం కంటైనర్‌ బాక్స్‌ను న్యూ డయోగ్నస్టిక్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. బుధవారం ఆసుపత్రికి వచ్చిన సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు కంటైనర్‌ బాక్స్‌ను ఏర్పాటు గురించి సీసీ కెమెరాను పరిశీలించి ఆరా తీశారు. జిరాక్స్‌ సెంటర్‌ కంటైనర్‌ బాక్స్‌ తీసుకుని రావడంలో ఓ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన నాయుకుడని పాత్ర ఉందని తెలుసుకుని, ఆయన్ను ఆఫీసుకు రప్పించుకుని సూపరింటెండెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మంగళవారం రాత్రి 9 గంటలకు మంత్రి అనుచరుడు ఆసుపత్రిలో కంటైనర్‌ను ఏర్పాటు చేశాడు. కలెక్టర్‌ పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వకుండానే జిరాక్స్‌ పరికరాన్ని లోపల పెట్టేందుకు అనుమతి ఇచ్చిన సెక్యూరిటీ సూపర్‌వైజర్లు అహ్మద్‌, సురేష్‌గౌడులను విధుల నుంచి తొలగించారు. కంటైనర్‌ బాక్స్‌ను తీసుకురావడానికి సహకరించిన ఓ ఉద్యోగ సంఘం నాయకునిపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ కమిటీని నియమించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు కంటైనర్‌ బాక్స్‌ను హెల్త్‌ ఇనస్పెక్టర్లు కృష్ణమూర్తి, టి. గోవిందు, సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్‌వో రామకృష్ణ కంటి ఆసుపత్రి ఆవరణలోకి తరలించారు.

Updated Date - Jan 14 , 2026 | 11:16 PM