ప్రముఖ కథకుడు ఉదయభాను ఇకలేరు!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:35 AM
ప్రముఖ కథకుడు, నవలా, అనువాద రచయిత, ఎం. ఉదయభాను (73) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని...
అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో పదేళ్లపాటు ‘అపరాధి’ శీర్షికన క్రైమ్ స్టోరీస్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథకుడు, నవలా, అనువాద రచయిత, ఎం. ఉదయభాను (73) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘అపరాధి’ శీర్షికన 2002 నుంచి 2012 వరకు ఆయన క్రైమ్ స్టోరీస్ రాశారు. ‘ఆంధ్రజ్యోతి’ అనుబంధ వారపత్రిక నవ్య వీక్లీలో కూడా పలు కథలు రాశారు. మహాకవి దాశరథికి ఉదయభాను స్వయాన మేనల్లుడు. ఆయన రాసిన కథలు వందల సంఖ్యలో తెలుగునాట అన్ని ప్రముఖ వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ’ది గైడ్‘ నవల ఆంధ్రభూమి వారపత్రికలో ఉత్తమ నవలగా ఎంపికై ప్రచురితమైంది. ఉదయభాను ఏపీ టూరిజం కార్పొరేషన్‌లో 28 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. 2011లో డివిజనల్ మేనేజర్ హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఉత్తమ ట్రావెల్ రచయితగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన రెండుసార్లు పురస్కారాన్ని అందుకున్నారు. ఉదయభాను అంత్యక్రియలు కుటుంబసభ్యుల సమక్షంలో పూర్తయ్యాయి.