భక్తిశ్రద్ధలతో వాసవీ మాతకు పూజలు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:01 AM
పట్టణంలోని కన్యకా పర మేశ్వరీ దేవాలయాల్లో ఆర్యవైశ్య ప్రముఖు లు మంగళవారం వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయాల్లో అమ్మవారికి
అభిషేకాలు, అర్చనలు, హోమాలు
సామూహిక కుంకుమార్చనలో
పాల్గొన్న మహిళలు
నంద్యాల కల్చరల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కన్యకా పర మేశ్వరీ దేవాలయాల్లో ఆర్యవైశ్య ప్రముఖు లు మంగళవారం వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవీమాతకు నంద్యాల చెరువుకట్ట నుంచి తెచ్చిన జలాలతో కలషాభిషేకముతో పాటు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు, సామూహిక కుంకుమార్చన పూజలు చేశా రు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాశి వాసు,ఆత్మకూరు సుదర్శనం శెట్టి,సభ్యులు కాల్వ విజయశేఖర్,,మారం నాగరాజు, రజనీకాంత, వాసవి మహిళా మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వాసవీమాత ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరిపారు. కాగా లోకకల్యాణం కోసం అన్యాయాన్ని ఎదురించి ఆత్మార్పణం చేసుకున్న వాసవీమాత గొప్పదనాన్ని వారందరు స్మరించుకున్నారు.
మహానంది: మహానందిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో మంగళవారం ఘ నంగా వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రం సెక్రటరీ నెరవాటి రవికుమార్ ఆధ్వర్యంలో సత్రం ఆవరణలో వాసవీమాత చిత్రపటాన్ని మహిళలు ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. కార్యక్రమంలో ఫుడ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శరణా రాధకృష్ణ, ఏవీ సుబ్బయ్య, భవనాశి రమణయ్య, మహానంది దేవస్ధానం మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జునరావు, చలపతిలు పాల్గొన్నారు.
వెలుగోడు/పాములపాడు: వెలుగోడు, పాములపాడు మండలాల్లో ఆర్యవైశ్యులు వాసవీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. వెలుగోడులోని అమ్మవారి శాలలో అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. పాములపాడు చౌడేశ్వరీదేవీ ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ ప్ర త్యేక పూజల్లో బాదం నాగేంద్ర, తాళ్లూరి సం జీవరాయ ప్రసాద్, రాము, నాగరాజు, సిం హాద్రి ప్రసాద్ పాల్గొన్నారు.
మిడుతూరు: వాసవీ కన్యకపరమేశ్వరి మాత ఆత్మార్పన దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని అమ్మవారి ఆలయంలో కమిటీ చైర్మన్ భూమా కృష్ణ మోహన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, హోమం నిర్వహించారు.
నందికొట్కూరు: పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవా రం కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ మహోత్స వం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్యులు నగరేశ్వర దేవికి, నగరేశ్వర స్వామికి పవిత్ర పవిత్ర జలాలతో వేద బ్రాహ్మణులతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భీమి శెట్టి జయరామకృష్ణ, పట్టణ ఆర్య వైశ్యులు మిత్ర సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.