రేపు ప్రపంచ జూనోసిస్ డే
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:33 AM
ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఈ నెల 6న రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలల్లో కుక్కలకు..
కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఈ నెల 6న రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలల్లో కుక్కలకు యాంటీరేబిస్ టీకాలను ఉచితంగా అందించనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదార్‌నాయుడు ప్రకటించారు. ఇందుకోసం పశు వైద్యశాలలకు 5.97లక్షల టీకాలను సరఫరా చేసినట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.