Share News

దివ్యాంగుల కోసం ప్రపంచ స్థాయి క్రీడా అకాడమీ

ABN , Publish Date - May 20 , 2026 | 05:49 AM

దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారుల్లో ఒక్కటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం రూ.4.5 కోట్ల కార్పొరేట్‌..

దివ్యాంగుల కోసం ప్రపంచ స్థాయి క్రీడా అకాడమీ

  • వెంకటాచలంలో స్టేడియం నిర్మాణానికి భూమిపూజ

  • రూ.4.5 కోట్లు అందజేసిన ఎస్‌ఈఐఎల్‌ సంస్థ

వెంకటాచలం, మే 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారుల్లో ఒక్కటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం రూ.4.5 కోట్ల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌)తో ప్రపంచ స్థాయి సమగ్ర క్రీడా అకాడమీ (స్టేడియం) నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. మండలంలోని సరస్వతి నగర్‌ సమీపంలో అనుపల్లిపాడు రైల్వేగేటు పక్కనే ఉన్న సీఆర్‌సీ (కాంపోజిట్‌ రీజినల్‌ సెంటర్‌) వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్‌ తారెక్‌ మొహమ్మద్‌ సుల్తాన్‌ అల్‌ ముగైరి, డైరెక్టర్‌ సైరస్‌ ఎరాచ్‌ కూపర్‌, సీఈఓ జనమేజయ మహాపాత్ర, ఎన్‌ఐఈపీఐడీ డైరెక్టర్‌ బీవీ రామ్‌కుమార్‌, సీఆర్‌సీ డైరెక్టర్‌ ఎస్‌పీ మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈఐల్‌ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 15 వేల చదరపు అడుగుల్లో అన్ని హంగులు, సౌకర్యాలతో ఈ ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - May 20 , 2026 | 05:49 AM