ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:43 PM
ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.
తుగ్గలి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు. సోమవారం పెండేకల్‌లో మాజీ సర్పంచ బర్మా వీరేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు వెంకటపతి, మాజీ జడ్పీటీసీలు వరలక్ష్మి, తిమ్మయ్య చౌదరి, చంద్రశేఖర్ యాదవ్, మసాల శ్రీను, పోలమ్మ, ఓలప్ప, కవిన, హరి, నాగరాజు, లాలెప్ప, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆదోని: పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదానని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. నాయకులు రంగస్వామినాయుడు, జిందేశంకర్, రామస్వామి, పట్టణాధ్యక్షులు తిమ్మప్ప, రంగన్న, క్లస్టర్-8 లక్ష్మీనారాయణ, శేఖన్న, వెంకటేష్, రత్నం, నాగేష్, గోపాల్, బాబు పాల్గొన్నారు.