Share News

మహిళల సాధికారత అంబేడ్కర్‌ లక్ష్యం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:40 PM

భవిష్యతను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది దశాబ్ధాల క్రితమే మహిళా సాధికారత గురించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పరితపించారని జాతీయ మహిళా కమిషన చైర్‌పర్సన విజయ రహత్కర్‌ అన్నారు.

   మహిళల సాధికారత అంబేడ్కర్‌ లక్ష్యం
జాతీయ మహిళా కమిషన చైర్‌పర్సనకు పుష్పగుచ్చం ఇస్తున్న ఈవో

జాతీయ మహిళా కమిషన అధ్యక్షురాలు విజయ రహత్కర్‌

శ్రీశైలం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): భవిష్యతను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది దశాబ్ధాల క్రితమే మహిళా సాధికారత గురించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పరితపించారని జాతీయ మహిళా కమిషన చైర్‌పర్సన విజయ రహత్కర్‌ అన్నారు. ఆయన ఆశయాల మేరకే మహిళలు రాణిస్తూ మహిళా సాధికారతను సాధిస్తున్నారన్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆమెకు రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన రాయపాటి శైలజ, నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన, ఈఓ శ్రీనివాసరావులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ముందుగా వారు శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానం పరిపాలనా భవనంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అప్పట్లో సూచించిన విధంగానే సమాజ పురోగతి మహిళలతో నేడు సాధ్యమవుతోందన్నారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానికంగా కూడా అధికారులు, పోలీసులు మహిళా కమిషనతో సమన్వయంతో పనిచేయడం వల్ల బాధిత మహిళలకు మరింత భరోసా కలుగుతుందని విజయ రహత్కర్‌ అన్నారు. మహిళల సమస్యలను వారి ముంగిటనే పరిష్కరించే లక్ష్యంతో జాతీయ మహిళా కమిషన చేపట్టిన ‘మహిళా జన సున్వాయ్‌’ (ప్రజా విచారణ) కార్యక్రమం దేశవ్యాప్తంగా 550 జిల్లాలు, ఏపీలో ఐదు జిల్లాల్లో కొనసాగుతోందన్నారు.

కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ భౌగోళికంగా ప్రపంచ వ్యాప్త ప్రాధాన్యత కలిగిన శ్రీశైల క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉండటం గర్వకారణమన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నమహిళల కోసం తక్షణ సాయం అందించేందుకు వనస్టా్‌ప సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా మహిళా ఉద్యోగుల కోసం జిల్లాలో రెండు వర్కింగ్‌ ఉమెన్స హాస్టళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఎస్పీ సునీల్‌ షెరాన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆవిర్భావం నుంచి 40 పోలీస్‌ స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సోమవారం ప్రత్యేక పబ్లిక్‌ గ్రీవెన్స రిడ్రెస్సల్‌ సిస్టమ్‌ నిర్వహిస్తూ మహిళల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన పోలీస్‌ స్టేషన్లలో ఇద్దరేసి సీఐలు, ఎస్‌ఐలు, 20 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. మహిళలపై జరిగే నేరాల తగ్గు ముఖం పట్టడానికి శక్తిటీమ్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నేరాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న హాట్‌స్పాట్‌ కేంద్రాలను గుర్తించి నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:40 PM