తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:06 AM
తాగునీటి కోసం రామచంద్రనగర్ కాలనీకి చెందిన మహిళలు సోమవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రాఘవేంద్ర సర్కిల్లో బైఠాయించారు.
ఫ రాఘవేంద్ర సర్కిల్లో ఖాళీబిందెలతో బైఠాయింపు
మంత్రాలయం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం రామచంద్రనగర్ కాలనీకి చెందిన మహిళలు సోమవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రాఘవేంద్ర సర్కిల్లో బైఠాయించారు. దాదాపు అరగంటసేపు ధర్నాకు దిగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, డిప్యూటీ ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి, తహసీల్దారు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్లపై ధర్నా చేయొద్దని తాగునీటి సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈఏడాది సెప్టెంబరు 23న ధర్నా చేస్తే అప్పటి నుంచి తాత్కాలికంగా ట్యాంకర్లతో నీటిని అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు, ప్రత్యేక అధికారి రమాదేవి మాట్లాడుతూ సూగూరు రిజర్వాయరు పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. 15 రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు.