మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సరికాదు: రామకృష్ణ
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:10 AM
మహిళా బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి విపక్షాలను ఎండ గడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి..
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి విపక్షాలను ఎండ గడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశా రు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంటు ఆమోదం పొం దింది. ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు డీలిమిటేషన్‌తో ముడిపెట్టి డ్రామాలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అందరూ చెబు తున్నా.. సీఎం చంద్రబాబుకు మాత్రం మోదీ, అమిత్‌షాలు ఏమి చెబితే అదే వేదవాక్కుగా కనిపించడంవిచారకరం’ అని అన్నారు.