Share News

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం మహాపాపం

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:13 AM

అభివృద్ధిలో, పాలనలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇండియా కూటమి అడ్డుకోవడం...

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం మహాపాపం

  • మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో, పాలనలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇండియా కూటమి అడ్డుకోవడం మహాపాపమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేయడానికే ప్రధాని మోదీ.. మహిళా రిజర్వేషన్‌, సీట్ల పెంపు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మహిళ అయి కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం దారుణం. ఆమె.. మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 04:14 AM