మహిళలు విద్యావంతులు కావాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:30 PM
ప్రతి మహిళా విద్యావంతురాలై ఆర్థిక గా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెం దుతుందని ఆదోని సీనియర్ సివిల్ న్యాయాధికారి యజ్ఞ నారాయణ అ న్నారు.
ఆదోని సీనియర్ సివిల్
న్యాయాధికారి యజ్ఞ నారాయణ
ఘనంగా అంతర్జాతీయ
మహిళా దినోత్సవం
ఆదోని, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళా విద్యావంతురాలై ఆర్థిక గా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెం దుతుందని ఆదోని సీనియర్ సివిల్ న్యాయాధికారి యజ్ఞ నారాయణ అ న్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని శనివారం మండలంలోని చాగి గ్రామంలో మహి ళా దినోత్సవాన్ని నిర్వహించారు. ము ఖ్య అతిథిగా న్యాయాధికారి యజ్ఞ నా రాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల కు కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళలు తమపై జరిగే అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం అందు బాటు లో ఉన్న న్యాయసేవల గురించి అవ గా హన కల్పించారు. సమావేశంలో గ్రా మ సర్పంచ్ రాజాగౌడ్, సీనియర్ అడ్వకేట్ లోకే్‌షకుమార్ పాల్గొన్నారు.
ఆదోని అగ్రికల్చర్ : మహిళలు విద్య, ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదిగినప్పుడే మహిళ సాఽధికారత సాధ్యమ ని ఏపీ రజక కార్పొరేషన చైర్మన సావి త్రి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ స్రవంతి అన్నారు. శనివారం ఏపీ ఎనజీవో భవనంలో అంతర్జాతీయ మహి ళా దినోత్సవం వేడుకలను అధ్యక్షురా లు ఉషారాణి అధ్యక్షతన నిర్వహించా రు. ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ మహిళ లేనిదే జీవితం లేదని, అన్నింటికీ మూలం మహిళ అని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రా ణించాలన్నారు. మన హక్కులను కాపాడుకోవడానికి చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహి ళా నాయకులు విజయలక్ష్మి, సుజ్ఞాన మ్మ, ఇందిరా డోరతి, ఏపీఎనజీవో నాయకులు బజారి నాగరాజు, లక్ష్మి, నాగేంద్ర, గౌస్, పీరా, మల్లికార్జున, శ్రీధర్ పాల్గొన్నారు.
ఆర్ట్స్ కళాశాలలో .....
అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ మాధవి, భాగ్యమ్మ, ఉషారాణి హాజరయ్యారు. మహిళల విశిష్టత మహిళ స్వేచ్చ సాధికారత భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. అనంతరం వివిధ రంగాలలో రాణించిన మహిళలను అధ్యాపకులను ఘ నంగా సన్మానించారు. కళాశాల వైస్ చైర్మన డాక్టర్ విజయలక్ష్మి కరస్పాండెంట్ దైవదీనం రెడ్డి, అధ్యాపకులు నలని, ఇందిరా, ఉమాదేవి, సంతోషి, ఈరమ్మ, చిత్రా, కీర్తి, హరిత, మంజు ల, జ్యోతి పాల్గొన్నారు.
ఆదోని రూరల్ : మహిళల హక్కుల సాధన కోసం పోరాడుదామ ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్క మహిళ నడుం బిగించాలన్నారు.