రోజా.. నోరు అదుపులో పెట్టుకో
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:24 AM
మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగు మహిళలు హెచ్చరించారు.
చిత్తూరులో మాజీ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన తెలుగు మహిళ
చిత్తూరు సిటి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగు మహిళలు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి రోజాకు లేదని ఎల్‌ఐసీ అరుణ అన్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని భువనేశ్వరిని అసెంబ్లీలో వైసీపీ నేతలు విమర్శిస్తుంటే ఒక మహిళగా ఎందుకు ఖండించలేదని నిలదీశారు.