29న విచారణకు హాజరవ్వండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:51 AM
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా..
అమర్నాథ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా కమిషన్ గతంలో జారీ చేసిన సమన్లపై అమర్నాథ్ స్పందిస్తూ... ‘వివరణకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు నాకు సమయం కావాలి. ఈ నెల 25 తర్వాత హాజరవుతాను’ అని కమిషన్‌కు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ తాజాగా సమన్లు జారీ చేసింది.