డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా ఉమెన్ బైకర్ల ర్యాలీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:06 AM
‘మార్గాలు వేరైనా కలలు ఒక్కటే’ అంటూ బుల్లెట్లపై మహిళా బైకర్లు బారులు తీరారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
‘మార్గాలు వేరైనా కలలు ఒక్కటే’ అంటూ బుల్లెట్లపై మహిళా బైకర్లు బారులు తీరారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మన ఆంధ్ర... మన డబ్ల్యూఏపీఎల్’ పేరుతో ‘బైక్స్ అండ్ బ్యాట్స్ కమింగ్ టుగెదర్’ అన్న నినాదంతో సాగిన ఈ ర్యాలీని నోవాటెల్ హోటల్ నుంచి మంగళగిరి స్టేడియం వరకు చేపట్టారు. గుంటూరు, వైజాగ్, అమరావతి, విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన సుమారు 100 మంది పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
- విజయవాడ కల్చరల్, ఆంధ్రజ్యోతి