Share News

అవయవదానంతో నలుగురికి పునర్జన్మ!

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:56 AM

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన నాయుడు మధుశ్రీ (25) ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది.

అవయవదానంతో నలుగురికి పునర్జన్మ!

  • ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ బ్రెయిన్‌ డెడ్‌

  • కుటుంబసభ్యుల అంగీకారంతో అవయవదానం

గుంటూరు మెడికల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన నాయుడు మధుశ్రీ (25) ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఈ నెల 13న గుంటూరులోని కిమ్స్‌ శిఖర హాస్పిటల్స్‌లో చేర్చారు. ఉరేసుకోవడం వల్ల తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో మెదడు పనితీరు దెబ్బతినట్టు వైద్యులు గుర్తించారు. 15న మధుశ్రీ బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ కౌన్సెలర్లు అవయవదానం ఆవశ్యకతను వివరించడంతో.. మధుశ్రీ భర్త, తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. 16న ఊపిరితిత్తులను చెన్నై అపోలో హాస్పిటల్‌కు, కాలేయం, ఒక మూత్రపిండాన్ని కిమ్స్‌ శిఖర హాస్పిటల్స్‌కు, మరొక మూత్రపిండాన్ని పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్‌కు అందజేశారు.

Updated Date - Mar 18 , 2026 | 06:58 AM