నా పరువు తీశారు
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:35 AM
అసలు పరిచయమే లేని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో వివాహేతర సంబంధం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా తన పరువు తీసిందని జెట్టి రేణుక అనే మహిళ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ నాయుడుతో వీడియోలో ఉంది నేను కాదు
పోలీసులకు తెనాలి మహిళ ఫిర్యాదు
తెనాలి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అసలు పరిచయమే లేని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో వివాహేతర సంబంధం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా తన పరువు తీసిందని జెట్టి రేణుక అనే మహిళ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ నాయుడుతో ఆ వీడియోలో కనిపించిన మహిళ వేరే కాగా, అది తానేనంటూ వైసీసీ సోషల్ మీడియా కావాలనే తన ఫొటోను విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు. ‘‘ఆయన నాకు రూ. 20 లక్షలు విలువ చేసే కారు కొనిచ్చారని, అది చాలక రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నానని వైసీపీ సోషల్ ప్రచారం చేస్తోంది’’ అని తన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. అశోక్ వైసీపీ జగన్, కుమార్ వైసీపీ పాలకొల్లు, షేక్ సయ్యద్ అనే మూడు ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా తనపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు. బాధ్యులను పట్టుకుని శిక్షపడేలా చూడాలని ఆమె అభ్యర్థించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.