Share News

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులకు మరింత భద్రత

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:57 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులోని సాక్షులకు భద్రత మరింత పెంచాలని పోలీసుశాఖ నిర్ణయించింది.

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులకు మరింత భద్రత

  • విచారణ పూర్తయ్యేదాకా వారి ఇళ్ల వద్ద పికెటింగ్‌

  • కీలక సాక్షులకు ఎమ్మెల్సీ అనంతబాబు,ఓ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులపై అప్రమత్తం

కాకినాడ, జూలై 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులోని సాక్షులకు భద్రత మరింత పెంచాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ‘మళ్లీ అదే బరితెగింపు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై స్పందించింది. హత్య కేసులోని కీలక సాక్షుల విచారణ పూర్తయ్యేవరకు వారి ఇళ్ల వద్ద పికెటింగ్‌కు నిర్ణయించింది. డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులను బెదిరించి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకుండా.. సాక్షులను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు అనంతబాబుతో బంధుత్వం కలిగిన కూటమి పార్టీ నేతకూడా సహకరిస్తున్నారు. హత్యకు అనంతబాబు ఉపయోగించిన కారు యజమానిని ఇప్పటికే ప్రలోభపెట్టేందుకు యత్నించారు. మరో 12 మంది సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాదవ్‌తో మాట్లాడారు. సాక్షులకు మరింత భద్రత కల్పించాలని ఆదేశించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:57 AM