Share News

నాన్నకు ప్రేమతో..

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:49 PM

కన్న తండ్రి ఇటీవలే అనారోగ్యానికి గురై ఆపరేషన చేయించుకున్నాడు.

 నాన్నకు ప్రేమతో..
రణమండల ఆంజనేయస్వామి మెట్టు ఎక్కుతూ కంటతడిపెడుతున్న బాలుడు అభిరామ్‌

తండ్రి కోలుకోవాలని 600 మెట్లు మోకాళ్లపై ఎక్కిన చిన్నారి

ఆదోని, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కన్న తండ్రి ఇటీవలే అనారోగ్యానికి గురై ఆపరేషన చేయించుకున్నాడు. నాన్న మీద ఆ కుమారుడికి ఎనలేని ప్రేమ. తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రేమను చాటుతూ భక్తిభావంతో 600 మెట్లు మెకాళ్లపై ఎక్కాడు. ఆదోని రణమండల క్షేత్రంలో శనివారం ఈఘటన ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. వివరాలు.. ఆదోనికి చెందిన ఆరో తరగతి విద్యార్థి అభిరామ్‌ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవలే ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇంకా ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. తండ్రి త్వరగా కోలుకోవాలని ఆ చిన్నారి రణమండల వీరాంజనేయస్వామికి మొక్కుకున్నాడు. మొక్కును నెరవేర్చుకునేందుకు ఏకంగా రణమండల కొండపై ఉన్న 600 మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ స్వామివారి సన్నిధికి చేరుకున్నాడు. లేలేత మోకాళ్లు రాళ్లకు రాసుకుపోతున్నా నొప్పిని భరిస్తూ నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఎక్కిన దృశ్యం అక్కడున్న భక్తులను గుండెల్ని పిండేసింది. అదే సమయంలో రణ మండల ఆలయ దర్శనానికి వచ్చిన ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి మోకాళ్లపై మెట్లెక్కెతున్న బాలుడిని చూసి ఆశ్చర్యపోయి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:49 PM