ఉత్సాహంగా..
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:51 PM
ఆదోని, మునిసిపల్ కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న అభ్యర్థులు పురపాలక కార్యాలయం నుంచి అందించే ఎనవోసీ కోసం అవస్థలు పడుతున్నారు.
మొదటిరోజు 12 నామినేషన్లు
టీడీపీ నుంచి నాలుగు, వైసీపీ నుంచి
ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు దాఖలు
ఆదోని, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం మొదటిరోజు వివిధ వార్డుల కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీజేపీ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలిరోజు మొత్తం 12 నామినేషన్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ నుంచి నాలుగు, వైసీపీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు దాఖలు చేశారు.
ఎనవోసీ కోసం అభ్యర్థుల పాట్లు
ఆదోని అగ్రికల్చర్: ఆదోని, మునిసిపల్ కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న అభ్యర్థులు పురపాలక కార్యాలయం నుంచి అందించే ఎనవోసీ కోసం అవస్థలు పడుతున్నారు. నామినేషన్లు దాఖలు శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో పోటీచేసే అభ్యర్థులు మునిసిపాలిటీకి తాము ఆస్తిపన్ను, నీటి పన్ను ఇతర పన్నులు చెల్లింపులు ఎలాంటి బకాయిలు లేవని నో అబ్జెక్షన సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు ప్రారంభం కావడంతో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే పోలీసులు నిబంధనల ప్రకారం ఎవరిని అనుమతి ఇవ్వడం లేదు . దీంతో అభ్యర్థులు ఎనవోసీ కోసం ఇక్కట్లు పడుతున్నారు. పురపాలక అధికారులు దృష్టికి పోలీసులు తీసుకెళ్లడంతో మె యిన రోడ్లో 100 మీటర్ల బయట ఎనవోసీ కోసం సిబ్బందిని ఏర్పాటుచేశారు. అక్కడే రూ. 700 చలానా కట్టి ఎనవోసీ పొందుతున్నారు.
ఇద్దరికే అనుమతి
మున్సిపల్ కౌన్సిలర్లుగా నామినేషన్ల దాఖలకు శుక్రవారం నుంచి ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థులు ర్యాలీగా వందల సంఖ్యలో వస్తున్న వారిని మునిసిపల్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోని పోలీసులు నిలిపివేస్తున్నారు. నామినేషనల దాఖలకు పోటీ చేస్తున్న అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో అభ్యర్థులు తమ నామినేషనల పత్రాల దాఖలకు పోటీ చేస్తున్న అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో అభ్యర్థులు తమ నామినేషనల పత్రాల ఽధాఖలకు నలుగురికి అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలు ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి తోపాటు ప్రపోజల్స్ ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో చేసేది లేక అనుకున్న ముహూర్తాలు మించి పోతుండడంతో అభ్యర్థులు లోపలికి వెళ్లి నామినేషన పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.
నోటరీలకు డిమాండ్
మునిసిపల్ కౌన్సిలర్‌గా పోటీస్తున్న అభ్యర్థులు నామినేషన్ల పత్రాలతో పాటు అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నోటరీల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నోటరీలకు బాగా డిమాండ్ పెరిగింది. వారి కార్యాలయం వద్ద క్యూ కడుతూ పోటీ చేసే అభ్యర్థులతో కిటకిట లాడుతున్నారు.
డ్రోన్లు, ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరణ
పురపాలక ఎన్నికల నామినేషనల పర్వం ప్రారంభం కావడంతో ఆదోనిలో మునిసిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆదోని ఏఎస్పీ జయశర్మ నేతృత్వంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై రామనాథ్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులను పురపాలక కార్యాలయం చుట్టూ ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు ప్రత్యేకంగా డ్రోన కెమెరాలు, వీడియో గ్రాఫర్లతో వీడియోను వచ్చిపోయే వారిని చిత్రీకరిస్తున్నారు.