Share News

వ్యూహాలు ఫలించేనా?

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:48 PM

ల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈనెల 23వ తేదీన పురపోరులో గెలిచిన చైర్మన అభ్యర్థులు ప్రమాణ స్వీకారంతో పాటు ఎక్కడిక్కడ గెలిచిన వార్డు సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్లు సైతం కలిసి వైస్‌ చైర్మన, కో- ఆప్షన సభ్యులను పరోక్షంగా ఎన్నుకోనున్నారు.

 వ్యూహాలు ఫలించేనా?

వైస్‌ చైర్మన పీఠాల కోసం పైరవీలు

మూడు టీడీపీ.. మూడు వైసీపీ దక్కే అవకాశం

నంద్యాల వైస్‌ చైర్మన ఎంపికపై ఉత్కంఠ

23న వైస్‌ చైర్మన, కోఆప్షన సభ్యుల ఎంపిక

పురపోరు ముగిసింది. రాజకీయంగా పార్టీల వారీగా బలాబలాలు తెలిసిపోయాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీడీపీ-4, వైసీపీ-2 చొప్పున చైర్మన పీఠాలు కైవసం చేసుకున్నాయి. ఆయా చైర్మన్ల ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన, కోఆప్షన సభ్యుల ఎంపికపై ఎక్కడికక్కడ రాజకీయంగా కసరత్తు మొదలైంది. ఇదే క్రమంలో ఆశావహులు సైతం తమదైన శైలిలో పైరవీలు మొదలెట్టారు. కో-ఆప్షన స్థానాలకు కూడా పోటీ ఉండటం రాజకీయంగా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

నంద్యాల, నవంబరు11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈనెల 23వ తేదీన పురపోరులో గెలిచిన చైర్మన అభ్యర్థులు ప్రమాణ స్వీకారంతో పాటు ఎక్కడిక్కడ గెలిచిన వార్డు సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్లు సైతం కలిసి వైస్‌ చైర్మన, కో- ఆప్షన సభ్యులను పరోక్షంగా ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పదవులు ఎవరికి వర్తిస్తాయో? అని ఆశావహులతో పాటు పట్టణ ప్రజల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో పలువురు ఆశావహులు సైతం తమదైన శైలిలో ఆయా ప్రజాప్రతినిధులు, కీలక నాయకుల ఆశీస్సుల కోసం పైరవీలు చేస్తున్నారు. మరోవైపు వార్డు సభ్యులుగా అవకాశం రాని వారు కూడా కో-ఆప్షన పదవుల కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వైస్‌ చైర్మన పీఠాలు మూడు టీడీపీకి, మూడు వైసీపీకి దక్కే అవకాశముంది.

వ్యూహత్మకంగా అడుగులు..

జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో వార్డులతో చైర్మన స్థానాలకు రసవత్తర పోరు సాగింది. చివరికి చైర్మన పీఠాల పరంగా టీడీపీ సత్తా చాటింది. వార్డుల్లో కొంత నిరాశ కలిగింది. వైస్‌ చైర్మన పదవికోసం ఎక్కడికక్కడ టీడీపీ, వైసీపీలు ఎవరికి వారు తమదైన శైలిలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తునా ్నరు.

నంద్యాలకు తీవ్ర పోటీ..

నంద్యాల మున్సిపాలిటీ వైస్‌ చైర్మన ఎంపికపై తీవ్ర పోటీ ఉన్నట్లు ప్రచారం మొద లైంది. ఇక్కడ 52 వార్డుల్లో టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 చొప్పున గెలిచారు. చైర్మన ఎంపిక పరంగా ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మనలకు ఎన్నుకునే అవకాశం ఉండటంతో టీడీపీకి కొంత కలిసి వచ్చే అంశంగా మారింది. వైస్‌ చైర్మన పీఠం కోసం ఇటు టీడీపీ, అటు వైసీపీలో ఉత్కంఠగా మారింది. ఈలోపు ఇరుపార్టీలు తెరవెనుక రాజకీయం చేసి వైస్‌ చైర్మన పీఠం ఎవరు సాధించుకుంటారో అన్నది టెన్షనగా మారింది? మరో వైపు బీజేపీ నుంచి గెలిపొందిన వ్యక్తి కూడా ఆ పీఠంకోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా రని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

మున్సిపాలిటీల వారీగా..

ఫ నంద్యాల మున్సిపాలిటీలో 52 వార్డుల్లో టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 చొప్పున గెలుపొందగా చైర్మనగా టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బాబన విజయం సాధించారు. వైస్‌ చైర్మన పీఠం కోసం ఇటు టీడీపీ, అటు వైసీపీ నువ్వా..నేనా అన్నట్టుగా పోటీ పడు తున్నట్లైంది. ఇక్కడ బీజేపీ వ్యక్తి సదరు పీఠం ఆశీస్తున్నట్లు సమాచారం.

ఫ డోన 36 వార్డుల్లో టీడీపీ-16, వైసీపీ-15, జనసేన-2, సీపీఐ-2, ఇండిపెండెంట్‌-1 చొప్పున వార్డులు దక్కించకున్నారు. చైర్‌పర్సనగా టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ విజయం సాధించారు. ఇక్కడ కూడా వైస్‌ చైర్మన పదవికి ముగ్గురు, కోఆప్షన పద వులకు తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ కూడా తెరవెనక రాజకీయం మొదలెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరికి పదవులు వరిస్తాయో? అని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది.

ఫ నందికొట్కూరులో 32 వార్డుల్లో టీడీపీ-9, వైసీపీ-23 చొప్పున గెలుపొందారు. ఇక్కడ చైర్‌పర్సనగా వైసీపీ అభ్యర్థి ఫాతిమాబీ గెలుపొందారు. అదే పార్టీలోని వారికే వైస్‌ చైర్మన పదవి దక్కేలా ఉంది. ఈలెక్కన సదరు మున్సిపాలిటీ వైసీపీ వశమైనట్లైంది. ఆయితే వైసీపీలో వైస్‌ చైర్మన పీఠంకోసం ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం.

ఫ ఆత్మకూరులో 32వార్డుల్లో టీడీపీ-18, వైసీపీ-9, బీజేపీ-1, జనసేన-1, ఇం డిపెండెంట్‌-1 చొప్పున దక్కించుకున్నారు. మిగిలిన ఒక వార్డులో త్వరలో ఎన్నిక జరగనుంది. ఇక్కడ చైర్మనగా టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ గోవిందరాజులు ఏకగ్రీవమ య్యారు. ఇక్కడ టీడీపీ నుంచి వైస్‌ చైర్మన పీఠం పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు స మాచారం. రాజీ ఒప్పందాల్లో భాగంగా వైస్‌ చైర్మన వైసీపీకి ఇస్తామనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

ఫ బేతంచెర్ల నగర పంచాయతాలో 28 వార్డుల్లో టీడీపీ-10, వైసీపీ-18 చొప్పున గెలుపొందారు. ఇక్కడ చైర్మనగా వైసీపీ నుంచి దూదేకుల దస్తగిరి గెలుపొందారు. సదరు మున్సిపాలిటీలో దాదాపుగా వైసీపీ వాళ్లకే వైస్‌ చైర్మన పీఠం దక్కునుంది. వీరిలో కూడా పోటీ పెరిగినట్లు తెలిసింది.

ఫ ఆళ్లగడ్డలో 32వార్డుల్లో టీడీపీ-22, వైసీపీ-8, జనసేన-2 చొప్పున ఏకగ్రీవమయ్యారు. చైర్‌ పర్సనగా టీడీపీ అభ్యర్థి షేక్‌ అనీషా ఏకగ్రీవమయ్యారు. టీడీపీ నుంచి ఐదుగురు వైస్‌ చైర్మన పీఠం కోసం పోటీలో ఉన్నట్లు సమాచారం. జనసేన వాళ్లు కూడా సదరు స్థానాన్ని ఆశిస్తున్నారని తెలిసింది. ఈనేపథ్యంలో వైస్‌ చైర్మన పీఠం ఎవరికి దక్కు తుందో? అని ఉత్కంఠ మొదలైంది.

Updated Date - Nov 11 , 2026 | 11:48 PM