జడ్పీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:41 PM
జిల్లాలో పరిషత పోరు తుది దశకు చేరింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన వారిలో జడ్పీచైర్మన, ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు కో- ఆప్షన పదవుల కోసం పోటీ మొదలైంది.
ఎంపీపీ, జడ్పీ చైర్మన ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఆశావహుల్లో పెరిగిన పోటీ
జడ్పీ చైర్మన పీఠం ఖరీదు?
వైస్ ఎంపీపీ, కో ఆప్షన సభ్యులకూ తప్పని పోటీ
నంద్యాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత పోరు తుది దశకు చేరింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన వారిలో జడ్పీచైర్మన, ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు కో- ఆప్షన పదవుల కోసం పోటీ మొదలైంది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా పదవులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 20వ తేదిన జడ్పీ చైర్మన, వైస్ చైర్మన పదవులకు సంబందించి పరోక్ష పద్ధతిలో ఎంపిక పక్రియ సాగనుంది. ఈ క్రమంలో కొందరు పదవుల కోసం రూ.కోట్లను ఖర్చు చేసేందుకు కూడా వెనకాడబోమంటూ పైరవీలు మొదలు పెట్టారు. జిల్లాలో 28 మండలాలకు 28 ఎంపీపీలు, 28 వైస్ ఎంపీపీలు, 28 కో- ఆప్షన సభ్యులను పరోక్షంగా ఎన్నుకుంటారు. పరిషత పోరులో ఎన్నికైన జడ్పీటీసీలందరూ కలిసి జిల్లా పరిషత చైర్మన, వైస్ చైర్మనతో పాటు కో- ఆప్షన సభ్యులను పరోక్షంగా ఎన్నిక జరగనుంది. కలెక్టర్ నేతృత్వంలో జరిగే జడ్పీ చైర్మన ఎన్నిక సభ్యులు చేతులు ఎత్తి తమ మద్ధతు తెలుపుతారు. ఈనెల 14వ తేదీలోపు విజేతలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అధికారులు ముందస్తుగానే సమాచారాన్ని అందిస్తారు. అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఫ ఖరీదైన జడ్పీ పీఠం
జిల్లా పరిషత చైర్మన పీఠం జనరల్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. 28 జడ్పీటీసీ, 28 ఎంపీపీ స్థానాల్లో ఏకంగా బీసీలకు-7, ఎస్సీలకు-6 చొప్పున కేటాయించారు. జిల్లా పరిషత చైర్మన జనరల్ కేటాయించడంతో ఇప్పటికే టీడీపీ నుంచి నెగ్గిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు చైర్మన పీఠం కోసం రాష్ట్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. తొలి జడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒకరు రూ.5 నుంచి రూ.7 కోట్లు.. మరో నేత రూ.10 నుంచి రూ.15 కోట్లు.. ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. తమకు అవకాశం కల్పిస్తే రూ.15 కోట్లు.. చైర్మనగా ప్రమాణా స్వీకారం తరువాత సుమారుగా రూ.7 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరో జడ్పీటీసీ సభ్యుడి నుంచి ప్రతిపాదన వచ్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జడ్పీ స్థానం రాజకీయ చర్చకు దారి తీసింది. స్థానిక సంస్థల ఫలితాల ప్రకారం టీడీపీ 23 జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ ఐదు స్థానాల్లో గెలిచింది. దీంతో టీడీపీ నుంచే జడ్పీ చైర్మన ఎన్నిక సునాయాసం కానుంది. అదేవిధంగా టీడీపీకి 232 ఎంపీటీసీలు ఉండగా వైసీపీకి 141, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. దాదాపు అన్ని మండలాల్లోనూ టీడీపీ ఎంపీటీసీల నుంచే ఎంపీపీ పదవిని అధిరోహించనున్నారు.